Sunday, December 22, 2024

హీరోలలో సూర్యది ప్రత్యేక శైలి

- Advertisement -
- Advertisement -

Surya is unique style among heroes

సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఇటి’ (ఎవరికీ తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ “ఈ సినిమా నాకు స్పెషల్ మూవీ. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతంగా వచ్చింది. అందరి హృదయాలను టచ్ చేసే చిత్రమిది”అని అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ఏ హీరో చేయని భిన్నమైన కథలతో సూర్య సినిమాలు చేస్తుంటారు.

గజనీ నుంచి జై భీమ్ వరకు చేసిన సినిమాలే ఆయన అభిరుచికి నిదర్శనం. సూర్యతో ఓ సినిమా చేయాలనుంది. ఇక ఇటి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ “ఈమధ్యే సూర్య నటించిన ‘జైభీమ్’ ఓటీటీలో ఇరగదీసింది. ఇండియన్ హీరోలలో సూర్యది ప్రత్యేక శైలి. ఇటి సినిమా సక్సె కావాలని కోరుకుంటున్నా”అని చెప్పారు. ఈ వేడుకలో రానా, డి.సురేష్‌బాబు, గోపీచంద్ మలినేని, సత్యరాజ్, రత్నవేలు, జ్ఞానవేల్ రాజా, జానీ, ప్రియాంక మోహన్, రాజశేఖర్ పాండ్యన్, వినయ్ రాయ్, జాన్వీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News