Monday, December 23, 2024

వాహ్…. అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్య….. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

2007లో టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై భారత్ గెలిచి వరల్డ్ కప్ ను ముద్దాడింది. చివరలో శ్రీశాంత్ క్యాచ్ పట్టుకున్న అనంతరం భారత్ అభిమానలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో తొలి కప్ గెలుచుకున్నాము. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోని సిక్స్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలోను టి20 వరల్ కప్ గెలవడంతో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చివరి ఓవర్లలో సౌతాఫ్రికా 16 పరుగులు చేయాల్సింది ఉండగా హార్ధిక్ వేసిన తొలి బంతిన మిల్లర్ గాల్లోకి లేపాడు. బౌండరీ వద్ద ఉన్న సూర్య కుమార్ అద్బుతంగా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. బంతి అందుకున్న అతడు బౌండరీ దాటాడు. బంతిని మైదానంలోకి విసిరి మళ్లీ వచ్చి అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News