Monday, January 20, 2025

టాప్‌లోనే సూర్యకుమార్

- Advertisement -
- Advertisement -

యశస్విజైశ్వాల్‌కు 6వ స్థానం
ఐసిసి టి20 ర్యాంకింగ్స్
దుబాయ్ : టి20 ర్యాకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఐసిసి తాజా ప్రకటించిన ఈ ర్యాంకిగ్స్‌లో బ్యాగింట్ విభాగంలో మిస్టర్ 360 అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐపిఎల్ 17లో దంచి కొట్టిన యువ బ్యాటర్ యశస్విజైశ్వాల్ టాప్10లోకి దూసుకొచ్చాడు. 700 పాయింట్లతో 6వ స్థానానికి ఎగబాకాదు. ఇంగ్లండ్ పించ్ హిట్టర్ పిలిఫ్ సాల్ట్ రెండో స్థానం లో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మార్క్మ్(్రదక్షిణాఫ్రికా). క్లాసెన్(దక్షిణాఫ్రికా), బ్రాండన్‌కింగ్(వెస్టిండీస్), ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) సయితం బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టాప్10లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ ర్యాకింగ్స్‌లో స్పిన్నర్ల హవా కొనసాగుతోంది. అందులో ఇద్దరు భారత స్పిన్నర్లు టాప్10లోకి దూసుకొచ్చారు. అక్షర్ పటేల్ 7, రవి బిష్ణోయ్ 10వ స్థానంలో నిలిచారు. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ టాప్ ర్యాంకులో కొనసాగుతుండగా.. శ్రీలంక సారధి వనిండు హసరంగ రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో మహ్మద్ నబీ(అఫ్గనిస్థాన్)కి మొదటి ర్యాంకులో నిలవగా.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 8వ స్థానం కైవసం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News