Wednesday, January 22, 2025

విరాట్ రికార్డు బద్దలు కొట్టిన సూర్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యకుమార్ తన 360 డిగ్రీ ఆటతో న్యూజిలాండ్‌కు పట్టపగలు చుక్కలు చూపించాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అబ్బురపరిచాడు. రెండో టి 20 మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఒకే సంవత్సరంలో ఇప్పటివరకు సూర్యాకుమార్ యాదవ్ ఏడు మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌లను దక్కించుకున్నాడు. గతంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(06) పేరిట ఉండేది. అంతర్జాతీయంగా అయితే జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో 7 మ్యాన్ ది మ్యాచ్‌లు తీసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టి-20లో ఇదే జోరు కొనసాగిస్తే మరో రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. టి-20, వన్డేలలో మెరుపు ప్రదర్శన చేస్తుండడంతో టెస్టు జట్టులోకి సూర్యాను  తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News