Saturday, December 21, 2024

సూర్య లేని ఫార్మాట్లను ఊహించలేము: రైనా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ అదరగొట్టడంతో ఈ సంవత్సరం అత్యుత్తమ ఆటగాడిగా ఐసిసి సూర్యాను ఎంపిక చేసింది. ప్రస్తుతం టి20, వన్డే మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఫస్ట్‌టైమ్ ఆసీస్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కు సూర్యాను ఎంపిక చేశారు. సూర్యాకు తుది జట్టులో స్థానం కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. టి20లో సూర్యాకుమార్ యాదవ్ 31మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు చేశాడు.

సూర్య కుమార్ మూడు ఫార్మాట్స్‌లో ఆడించాలని క్రికెటర్ సురేష్ రైనా తెలిపాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, మైదానంలో నాలుగు వైపులా బౌండరీలకు తరలిస్తు అబ్బుర పరుస్తున్నాడని రైనా కొనియాడారు. సూర్యా లేని ఫార్మాట్లను ఊహించలేమన్నాడు. ముంబయి జట్టులో ఉన్నప్పడు రెడ్ బాల్‌తో క్రికెట్ ఎలా ఆడాలో తెలుసుకున్నాడని తెలియజేశాడు. సూర్య టెస్టు క్రికెట్‌లో ఆడితే వన్డేల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, సెంచరీలు, డబుల్ సెంచరీలు అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మూడు ఫార్మాట్లు సూర్య ఆడితే బాగుంటుందన్న రైనా వ్యాఖ్యలను ప్రజ్ఞాన్ ఓజా సమర్ధించాడు. అతడు టెస్టు జట్టులో ఉండేందుకు వందశాతం అర్హత ఉన్నవాడన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News