ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 9 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టి-20ల్లో 8వేల పరుగుల మైలురాయిని దాటిన ఐదో భారత ఆటగాడిగా సూర్య నిలిచాడు.
ఈ జాబితాలో 12,976 (384 ఇన్నింగ్స్) పరుగులతో విరాట్ కోహ్లీ మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో 11,838(437 ఇన్నింగ్స్) పరుగులతో రోహిత్ శర్మ ఉన్నాడు. మూడో స్థానంలో శిఖర్ ధవన్(331 ఇన్నింగ్స్‌లో 9797 పరుగులు), నాలుగో స్థానంలో సురేష్ రైనా(319 ఇన్నింగ్స్‌లో 8654 పరుగులు) ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌తో 288 ఇన్నింగ్స్‌లో 152.28 స్ట్రైక్‌రేటుతో, 34.21 యావరేజ్‌తో 8007 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో నిలిచాడు. ఇక సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 116 పరుగలకే ఆలౌట్ కాగా.. ముంబై 12.5 ఓవర్లలోనే 121 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.