Monday, December 23, 2024

నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సూర్య కుమార్

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. సుదీర్ఘ కాలంగా టి20 ఫార్మాట్ బ్యాటింగ్ విభాగంలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తాజాగా నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య కేవలం రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉండడం గమనార్హం. హెడ్ 844 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సూర్యకుమార్ 842 పాయింట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు. ఫిలిప్ సాల్ట్ (ఇంగ్లండ్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), రిజ్వాన్ (పాకిస్థాన్) తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News