Monday, December 23, 2024

వాళ్లిద్దరి కంటే సూర్యానే బెటర్: రికీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త ఒరవడి, అద్భుతమైన నైపుణ్యం గల సూర్య కుమార్ యాదవ్‌లాంటి ఆటగాడిని చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసించారు. సూర్య ఐసిసి మెన్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ దక్కించుకున్నాడు. ఒకే సంవత్సరంలో 1000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్ 2021లో 1326 పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 2022లో 1164 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ పరుగులలో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సందర్భంగా సూర్యాను మెచ్చకుంటూ తన ట్విట్టర్ లో పాంటింగ్ ట్వీట్ చేశాడు. వచ్చే ఐపిఎల్‌లో సూర్యలాగా ఆడాలని కొందరు క్రికెటర్లు ప్రయత్నం చేస్తారని చెప్పారు. 187.43 స్ట్రైక్ రేటు, 46.56 సగటుతో 1100 పరుగులు చేయడం గొప్పవిషయమని పాంటింగ్ మెచ్చుకున్నాడు.

సూర్యాను ఎబి డివిలియర్స్, ఆస్ట్రేలియా కీపర్ అడమ్ గిల్ క్రిష్ట్‌తో పోల్చుతున్నారని, వాళ్లిద్ధరి కంటే సూర్య గొప్పగా ఆడుతున్నారని కొనియాడారు. 360 డిగ్రీ ఆటతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడని, షాట్ బంతులను కీపర్ మీదుగా వెనకకు ఫ్లిక్ చేస్తే చాలు అది సిక్స్, ఫోరుగా వెళ్తోందన్నాడు. డీప్ బ్యాక్‌వార్డు స్కోయర్ ఫైన్ లెగ్ మీదుగా బంతి అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. ఐపిఎల్‌లో నాలుగు, ఐదు సంవత్సరాల క్రితం ఈ విధంగా బాదడం ప్రారంభించాడని, ఇప్పుడు ఆ తరహా బంతులు ఆడడంలో రాటుదేలాడన్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ(296), రెండో స్థానంలో డచ్ క్రికెటర్ మ్యాక్స్ ద్వాద్(242),  సూర్య (239) మూడో స్థానంలో ఉన్నాడు.  శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రాణించడంతో టి20 బ్యాటింగ్‌లో 908 పాయింట్లు వచ్చిన రెండో అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News