Monday, December 23, 2024

సూర్యాకుమార్ యాదవ్ ఔట్.. 221/4

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: ఈడెన్ పార్క్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 42 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెటపై ఓపెనర్లు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. శుభమన్ గిల్ 50 పరుగులు చేసి పరుగుజన్ బౌలింగ్ లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. శిఖర్ ధావన్ 72 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో ఫిన్ అలెన్ కు క్యాచ్ వెనుదిరిగాడు. రిషభ్ పంత్ 15 పరుగులు చేసి పరుగుజన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. సూర్యాకుమార్ యాదవ్ నాలుగు పరుగులు చేసి పరుగుజన్ బౌలింగ్ లో ఫిన్ అలెన్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. సూర్యా తక్కువ స్కోర్ కే ఔట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(52), సంజూ శామ్సన్(25) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News