Wednesday, January 22, 2025

టీ20 ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్..

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ నయా రికార్డు సృష్టించాడు. తాగాజా ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటిన సూర్య, ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానానికి ఎగబాకాడు.

తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఇటీవల సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లోనూ చెలరేగిపోయాడు. ఒక అర్థ శతకంతోపాటు మరో అద్భుత సెంచరీతో అలరించాడు. దీంతో టీ20 ర్యాంకింగ్స్ లో మరిన్ని రేటింగ్ పాయింట్లను సాధించి తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో సూర్య 908 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. దీంతో టీ20లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా సూర్యకుమార్ చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News