Sunday, December 22, 2024

సూర్య పాక్ లో జన్మించి ఉంటే… పిసిబికి బలి: సల్మాన్ భట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్కై, 360 డిగ్రీ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్‌లో జన్మించి ఉంటే అతడికి జాతీయ జట్టులోకి చోటు లభించేది కాదని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తెలిపాడు. 30 సంవత్సరాలు నిండిన తరువాత సూర్య జాతీయ జట్టులోకి వచ్చాడు. భారత్‌లో పుట్టడం అతడు చేసుకున్న అదృష్టమని ప్రశంసించాడు. అతడు పాక్‌లో జన్మించి ఉంటే పాలసీ బాధితుడిగా మిగిలి ఉండేవాడన్నాడు. అతడు బ్యాటింగ్ శైలి ప్రత్యేకంగా ఉందని, అతడి ఫిట్‌నెస్, ఆటలో పరిపక్వత, ఏ బౌలర్ బంతి ఎలా వేయగలడో ముందే ఊహించి బ్యాటింగ్ చేస్తాడని కొనియాడాడు. మిస్టర్ 360 అని సూర్యను కితాబిచ్చాడు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా రమీజ్ రజా ఉన్నప్పుడు 30 ఏళ్ల ఫార్ములా తెరపైకి తీసుకవచ్చాడని, 30 ఏళ్లు నిండిన ఆటగాడు నేరుగా జాతీయ జట్టులోకి అవకాశాలు కల్పించలేదని వాపోయాడు.

సూర్యను ఉదాహరణ చూపుతూ పిసిబి వైఖరిని సల్మాన్ ఎండగట్టాడు. ఐపిఎల్‌లో ముంబయి తరుఫున అద్భుతంగా ఆడడంతో సూర్యాను 2021 మార్చిలో టీమిండియాలోకి అవకాశాలు వచ్చాయి. గత సంవత్సరం 1000 పరుగులు చేసి ఐసిసి టి20 ర్యాంకింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి 1500 పరుగుల మైలు రాయిని దాటేశాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో అతి తక్కువ 843 బంతులు ఎదుర్కొని 1500 పరుగులు చేసిన వీరుడు సూర్య. సూర్య బాటింగ్ చేస్తున్నప్పుడు ఏ బౌలర్‌కైనా సునామీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ 39 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు చేయగా సూర్యకు 43 ఇన్నింగ్స్‌లు పట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News