హైదరాబాద్: ఆసియా కప్ లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యాకుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. 26 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. చివర ఓవర్లలో నాలుగు సిక్సర్లు కొట్టి అదరగొట్టాడు. సునామీ సృష్టించిన సూర్యాకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మ్యాచ్ అనంతరం సూర్యాకుమార్ మీడియాతో మాట్లాడారు. షాట్ల కోసమైతే ప్రాక్టీస్ చేయలేదు కానీ చిన్నప్పుడు స్నేహితులతో రబ్బరు బంతితో సిమెంట్ రోడ్డుపై ఆడేవాడినని గుర్తు చేశాడు. రబ్బరు బంతితో ఆడేటప్పుడు భారీ షాట్లు ఆడేవాడనని తెలిపాడు. బ్యాటింగ్ వచ్చేటప్పటికి దూకుడుగా ఆడాలని నిర్ణయం తీసుకున్నానని, చెత్త బంతి కనిపించగానే స్టాండ్ లోకి పంపించానని వివరించాడు. 170 నుంచి 175 పరుగులు చేయాలని అనుకున్నామని, ఇదే మంచి స్కోరు అని, చివరలో చెలరేగడంతో 192 పరుగులు చేశామని వివరించాడు. సూపర్-4లో భారత జట్టు మ్యాచ్ ఆదివారం ఆడనుంది. హాంకాంగ్-పాకిస్తాన్ జట్లలో ఎవరు గెలిస్తే వారితో ఆడే అవకాశాలున్నాయని చెప్పాడు.
సిమెంట్ రోడ్డుపై ఆ బంతితో ఆడేవాడ్ని: సూర్యాకుమార్ యాదవ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -