Friday, November 15, 2024

కెప్టెన్ అనే మాట మర్చిపోయా: సూర్యకుమార్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఆసీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాదించింది. ఆసీస్‌పై 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్‌కు టి20లో ఇదే అత్యధిక ఛేదనగా రికార్డు సృష్టించింది. గతంలో 2019లో విండీస్‌పై 208 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ ధాటిగా ఆడి 42 బంతుల్లో 80 పరుగులు చేశాడు. రింకు సింగ్ చివరలో మెరవడంతో 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సూర్య కుమార్‌కే దక్కింది. ఈ మ్యాచ్‌లో మూడు రనౌట్లు కావడం ఇది రెండో సారి గతంలో జింబాబ్వేపై ముగ్గురు రనౌట్ అయ్యారు. సూర్యకుమార టి20ల్లో వంద సిక్స్‌లు ఖాతాలో చేరాడు.

తీవ్ర ఒత్తిడిలోనూ భారత ఆటగాళ్లు ఆడిన తీరు బాగుందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. ఆసీస్ బ్యాటింగ్ తొలుత 15 ఓవర్లు చూశాక 230 నుంచి 235 పరుగులు చేస్తారనిపించిందని, చివరలో మన బౌలర్లు పుంజుకోవడంతో 208 పరుగలకే కట్టడి చేశారని కొనియాడారు. విశాఖపట్నం పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉందని, కాస్త మంచు ప్రభావం ఉందని పేర్కొన్నారు. కెప్టెన్ అనే బారాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలేసి మైదానంలోకి దిగానని సూర్య వివరించాడు. అభిమానుల మద్దతు భారీ స్థాయిలో ఉండడంతో ప్రతి ఒక్కరికి సూర్య ధన్యవాదాలు తెలిపారు. రింకు సింగ్ చివరలో తన పని తాను చేసుకొని పోయాడని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News