తిలక్ వర్మ ముందుకు, ఐసిసి టి20 ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇటీవల విండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో సూర్యకుమార్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. దీంతో అతని టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం సూర్యకుమార్ (907) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాకిస్థాన్ స్టార్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రిజ్వాన్ (811) పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కాగా, టాప్10లో భారత్ తరఫున ఒక్క సూర్యకుమార్ మాత్రమే చోటు సంపాదించాడు. ఇక హైదరాబాద్‌కు చెందిన యువ ఆటగాడు తిలక్‌వర్మ తాజా ర్యాంకింగ్స్‌లో 46వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
Also Read: లవ్ జిహాద్ పేరిట దారుణం: ముంబైలో ముస్లిం యువకుడిపై దాడి(వైరల్ వీడియో)
టి20 సిరీస్‌లో తిలక్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక యశస్వి జైస్వాల్ 88వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) మూడో, ఐడెన్ మార్‌క్రమ్ (సౌతాఫ్రికా) నాలుగో, రొసొ (సౌతాఫ్రికా) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రషీద్ 713 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) రెండో, వనిండు హసరంగ (శ్రీలంక) మూడో, మహీశ్ తీక్షణ (శ్రీలంక) నాలుగో, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇక టీమ్ విభాగంలో భారత్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. టీమిండియా 264 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో, న్యూజిలాండ్ మూడో, పాకిస్థాన్ నాలుగో, సౌతాఫ్రికా ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.