Sunday, December 22, 2024

నా కుటుంబం కోసం ఆమె ఎన్నో వదులుకుంది: సూర్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: జ్యోతిక 18 ఏళ్ల వయసులో ఎన్నో వదులుకొని చెన్నైకు వచ్చిందని హీరో సూర్య తెలిపారు. హీరో సూర్య కుటుంబం ముంబయికి షిఫ్ట్ కావడంతో ఆయన తాజాగా స్పందించారు. జ్యోతిని పెళ్లి చేసుకున్న తరువాత చెన్నైలో ఉన్నామని, తన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని ప్రశంసించారు. తన కుటుంబం కోసం ఆమె స్నేహితులు, కెరీర్‌ను వదులుకుందన్నారు. ప్రస్తుతం ముంబయికి మారడంతో జ్యోతికి తన స్నేహితులతో సమయం గడుపుతోందని, వృత్తిపరంగా బిజీగా ఉందని తెలియజేశారు. కొవిడ్ తరువాత మార్పు రావడంతో ముంబయికి షిఫ్ట్ అవ్వాలనుకున్నామని సూర్య వివరించారు. నేను గొప్ప దర్శకులతో పని చేయాలని అనుకుంటానని, కానీ ఆమె మాత్రం కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పని చేస్తుందన్నారు.

విభిన్నమైన ప్రాజెక్టులు చేయడంతో పాటు వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ ఆమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ‘శ్రీకాంత్’, ‘కాదల్ ది కోర్’ సినిమాలలో వైవిధ్యంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముంబయిలో ఉన్నప్పుడు పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. రీల్, రియల్ కపూల్‌గా సూర్య, జ్యోతిక అనే దంపతులు మంచి పేరు తెచ్చుకున్నారు. పూవెల్ల కేట్టుప్పార్ సినిమాతో కలిసి నటించారు. బెంగళూరు డేస్ సినిమాలో జ్యోతికతో కలిసి సూర్య నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు అంజలి మేనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వార్త నిజమైతే 18 ఏళ్ల తరువాత సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ఈ జంట కనిపించనుంది. కంగువా సినిమాలో సూర్య హీరోగా నటించాడు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News