Thursday, January 23, 2025

సూర్యదేవాలయం అద్భుత నిర్మాణం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: సూర్యదేవాలయం అద్భుతంగా నిర్మాణం చేపట్టారని మారుమూల గ్రామంలో అయిన ఎంతో సుందరంగా నిర్మాణం చేపట్టారని హైకో ర్టు న్యాయమూర్తి రాధారాణి అన్నారు. శనివారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురంలో ఉన్న అఖండజ్యోతి సూర్యనారాయణ క్షేత్రంలో శనివారం వా రు దర్శించుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నా రు. అనంతరం వారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో తొలి సూర్యదేవాలయం ని ర్మాణం చేపట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని దేవాలయాన్ని వైభవంగా ఆహ్ల కరమయిన వాతావరణంలో నాలుగు గుట్టల మధ్య ప్రశాంత వాతావరణంలో సూర్యదేవున్ని నెల కొల్పారని వారన్నారు.

ఈ సంధర్బంగా దేవాలయం గురించి వివరాలు అ డిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఆలయ నిర్వాహకులు కాకులారపు జనార్థన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి వెంట జిల్లా న్యాయమూర్తి రాంగోపాల్, సూపరిడెంట్ సంజయ్ కుమార్, అర్చకులు రామశర్మ, శివరామశర్మ, భక్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News