Sunday, January 19, 2025

సూర్యకుమార్‌కు టాప్ ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత సంచలనం సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సూర్యకుమార్ కెరీర్‌లో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొంత కాలంగా సూర్యకుమార్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో సూర్యకుమార్‌కు టాప్ ర్యాంక్ వరించింది. ప్రస్తుతం అతను 863 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రిజ్వాన్ 842 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. డెవోన్ కాన్వే (కివీస్) మూడో, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) నాలుగో, మార్‌క్రామ్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ (అఫ్గాన్) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. 700 పాయింట్లతో రషీద్ అగ్రస్థానంలో నిలిచాడు. వనిందు హసరంగా (శ్రీలంక) రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. శామ్ కరన్ (ఇంగ్లండ్) ఆరో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు.

Suryakumar claims top spot in ICC T20 Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News