Sunday, December 22, 2024

రికార్డులు సృష్టించిన సూర్యకుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నాడంటే చాలు పరుగుల వరద పారిస్తాడు. బ్యాట్‌కు బంతి తగలిదంటే చాలు బౌండరీ దగ్గర ఉండాల్సిందే. మనోడి ఆటకు స్కై, 360 డిగ్రీస్ అనే పేర్లతో ముద్దుగా క్రికెట్ అభిమానులు పిలుచుకుంటారు. సూర్య ఆడితే చాలు ఆ జట్టు విజయం సాధించనట్టుగా అతడి పేరు మార్మోగిపోయింది. సెయింట్ జార్జ్ పార్క్ వేధికగా భారత జట్టు సౌతాఫ్రికా రెండో టి20 ఆడింది. ఈ మ్యాచ్‌లో సూర్య హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. బౌలర్లు దారుళంగా పరుగులు సమర్పించుకోవడంతో రెండో టి20లో భారత్ ఓటమిని చవిచూసింది. సూర్య వ్యక్తిగత స్కోరు 15 వద్ద 2000 పరుగుల మైలురాయిను అందుకొని రికార్డులు సృష్టించాడు. టి20ల్లో 1164 బంతుల్లోనే 2000 పరుగుల మార్కును అందుకొని రికార్డు సృష్టించాడు.

గతంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 1283 బంతుల్లో 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. రెండు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరు 52 ఇన్నింగ్స్‌లు, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ 56 ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. కెఎల్ రాహుల్ 58 ఇన్నింగ్స్ ల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసి తరువాత స్థానాల్లో ఉన్నాడు. భారత జట్టు తరపున టి20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో సూర్య నాలుగో స్థానంలో ఉండగా అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 4008 పరుగులు, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో 3853 పరుగులు, కెఎల్ రాహుల్ 68 ఇన్నింగ్స్‌లో 2256 పరుగులతో ముందు వరసలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News