Wednesday, January 22, 2025

ముంబై ఇండియన్స్ కు షాక్.. ఐపిఎల్ 2024కు సూర్య దూరం?

- Advertisement -
- Advertisement -

భారత టీ20 స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ .. ఐపిఎల్ 2024కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇటీవల చీలమండల గాయానికి గురైన సూర్యకుమార్.. ఇప్పుడు స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్య చికిత్స పొందుతున్నాడు.

మరో రెండు మూడు రోజుల్లో సర్జరీ కోసం సూర్య జెర్మనీ వెళ్లనున్నట్లు తాజాగా బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది జూన్ లో జరిగే టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని బిసిసిఐ.. సూర్యను ఐపిఎల్ లో ఆడించే సాహసం చేయకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ సూర్య ఐపిఎల్ ఆడకపోతే.. ముంబయి ఇండియన్స్ జట్టకు భారీ దెబ్బ తలిగిలినట్లే గాయం కారణంగా ఈనెల 11 నుంచి ఆఫ్గనిస్తాన్ తో జరగనున్న టీ20 సిరీస్ కు కూడా సూర్యకుమార్ దూరమయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News