మెల్‌బోర్న్: బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ దూసుకుపోతున్నాడు. మైదానంలో రికార్డుల హోరు సృష్టిస్తున్నాడు. సూర్య జోరును అడ్డుకోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు సవాల్‌గా మారింది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్య చెలరేగిపోయాడు. ఓపెనర్ రాహుల్‌తో కలిసి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. 23బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన 61పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈక్రమంలో భారత్ తరఫున తక్కువ బంతుల్లో హాఫ్‌సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో సూర్య నాలుగో స్థానంలో నిలిచాడు. 2007లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌సింగ్ 12బంతుల్లో అర్ధశతకం నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కేఎల్ రాహుల్ 2021లో స్కాట్లాండ్‌పై 18 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేయగా, 2007లో ఆసీస్‌పై యువీ 20బంతుల్లో హాఫ్‌సెంచరీ సాధించి మరోసారి ఎక్కాడు. వీరి తర్వాత సూర్య ఈ జాబితాలో నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు. టి20 ప్రపంచకప్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన జాబితాలో సూర్య అగ్రస్థానంలో నిలిచాడు. 193.96స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక స్ట్రైక్‌రేట్ కావడం విశేషం. 2022లో టీ20ల్లో 1000పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. ప్రస్తుతం సూర్య పరుగులతో ప్రథమస్థానంలో ఉండగా, పాక్ బ్యాటర్, వికెట్ కీపర్ రిజ్వాన్(924), కోహ్లీ(731) తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.
Suryakumar Yadav 1st batter to hit 1000 T20I Runs