Sunday, January 19, 2025

ఐసిసి ఉత్తమ టి20 క్రికెటర్‌గా సూర్యకుమార్

- Advertisement -
- Advertisement -

దుబాయి: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సాధించాడు. 2022 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన సూర్యకుమార్ కొద్ద సమయంలోనే టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. 2022 సంవత్సరంలో సూర్యకుమార్ టి20 ఫార్మాట్‌లో పరుగుల వరద పారించాడు. 31 మ్యాచుల్లో 45.56 సగటుతో 1164 పరుగులు సాధించాడు. 2022లో టి20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత కూడా సూర్యకుమార్‌దే.

కిందటి ఏడాది సూర్యకుమార్ పొట్టి ఫార్మాట్‌లో ఏకంగా మూడు శతకాలు సాధించి పెను ప్రకంపనలు సృష్టించాడు. అంతేగాక రికార్డు స్థాయిలో 68 సిక్సర్లు బాది మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టి20 వరల్డ్‌కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో మూడు అర్ధ సెంచరీలు సాధించి సత్తా చాటడు. ప్రస్తుతం సూర్యకుమార్ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, అతని ప్రతిభను దృష్టిలో పెట్టుకుని సూర్యకుమార్‌ను ఐసిసి ఉత్తమ క్రికెటర్‌గా ఎంపిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News