Saturday, February 22, 2025

ఐపిఎల్ నుంచి సూర్యకుమార్ ఔట్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ సీజన్15 మిగిలిన మ్యాచ్‌లకు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యాడు. ఎడమ చేయి కండరానికి గాయం కావడంతో సూర్యకుమార్ ఐపిఎల్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం సోమవారం అధికారికంగా ప్రకటించింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ బరిలోకి దిగలేదు. ఇటీవల ప్రాక్టీస్ సందర్భంగా అతను గాయపడ్డాడు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తేలింది. దీంతో సూర్యకుమార్‌కు కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతను ఐపిఎల్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కూడా సూర్యకుమార్ దూరంగా ఉన్నాడు. అయితే తర్వాత ఆడిన 8 మ్యాచుల్లో 303 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక అతను దూరం కావడం ముంబైకి ఇబ్బందికర అంశమేనని చెప్పక తప్పదు.

Suryakumar Yadav Ruled out of IPL 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News