Sunday, January 19, 2025

రెండు బస్సులు దగ్ధం….

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: బస్సులో మంటలు చెలరేగడంలో రెండు బస్సులు దగ్ధమైన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం గంపుల గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గంపుల గ్రామ సమీపంలో ఎపిఎస్‌ఆర్‌టిసి సంబంధించిన బస్సు ఆగిపోయింది. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించారు. ఆగిపోయిన బస్సును రిపేర్ చేయడానికి మరో బస్సులో సిబ్బంది అక్కడికి చేరుకొని రిపేర్ చేస్తుండగా బ్యాటరీలో మంటలు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసి పడడంతో చూస్తుండగానే బస్సు కాలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News