Saturday, December 21, 2024

ప్రేమపెళ్లి… భార్యతో గొడవ… ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దంపతులు మధ్య గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో ఉరేసుకొని చనిపోయిన సంఘటన సూర్యాపేట జిల్లా బాణాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాణాపురం గ్రామానికి చెంది బాణాల శ్రీనివాస్, బరాఖత్ గూడానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు రావడంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. బరాఖత్ గూడాకు వెళ్లి భార్యను కాపురానికి రమ్మని అడిగాడు. భార్యతో గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో అక్కడి నుంచి అతడు బాణాపురం వచ్చాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రీనివాస్ ఉరేసుకున్నాడు. శ్రీనివాస్ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News