Sunday, December 22, 2024

కోదాడలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరంగాపురం గ్రామం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి చెవులు కుట్టించేందుకు కారులో ఎనిమిది మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు చిన్నారులు సురక్షితంగా భయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు ఖమ్మం జిల్లా బోనకల్ (మం) గోవిందపురం గ్రామం,  కోదాడ (మం) చిమిరాల గ్రామం వాసులుగా గుర్తించారు. మృతులు జల్ల శ్రీకాంత్, మాణిక్యమ్మ, చందర్ రావు, క్రిష్ణ రావు, స్వర్ణ, లాస్యగా గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News