Friday, December 27, 2024

ప్రజా ఉద్యమాల పురటిగడ్డ సూర్యాపేట

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ప్రజా ఉద్యమాలకు పురిటిగడ్డ సూర్యాపేట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ముఖ్యలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రజా ఉద్యమా కోసం కుటుంబాన్ని వదులుకోని కా॥ ధర్మభిక్షం సమాజానికి అ ంకితమవ్వగా ఆస్తిపాస్తులను కాదనుకోని బీఎన్ పోరాటాల బాట పట్టారని గుర్తు చేశారు.

సూర్యాపేటకు ఎమ్మెల్యేగా పని చేసి ఉప్పల మల్సూర్ నిజాయితికి నిలువుటద్దంగా నిలిచారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నిర్మాణంతో పాటు మలి, తొలి దశ తెలంగాణ ఉద్యమాలకు సూర్యాపేట ప్రాంతం ఊపిరిలిగా నిలిచిందన్నారు. ప్రతీ ఉద్యమ నిర్మాణంలో వర్తక, వ్యాపారుల, వాణిజ్య వర్గాల ప్రోత్సహాం ఎంతో కీలకం అన్నారు.1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమాల ప్రారంభానికి సూర్యాపేట వేదికైందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలభవన్ ఏర్పాటులో వనమా వెంకట్రామయ్య కృషిచెప్పలేనిదని కొనియాడారు.

సూర్యాపేట ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకవచ్చిన మహానీయులను స్మరించుకోవడంతో పాటు రోడ్డు విస్తరణలో తీసిన కేసీ గుప్తా విగ్రహ పునరుద్దరణ కార్యక్రమంను ఈనెల 16న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మీలా మహాదేవ్, మోరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల ఆనంద్, తోట శ్యామ్, బండారు రాజా, రాచర్ల కమలాకర్, మీలా వంశీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాఆనంద్, గుండా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News