Tuesday, December 24, 2024

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

ఈశ్వర్ హీరోగా నైనా సర్వర్ హీరోయిన్‌గా నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘సూర్యాపేట జంక్షన్’. ఈ చిత్రాన్ని యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. ఎస్ రావు, విష్ణువర్ధన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సూర్యాపేట జంక్షన్’ మూవీకి రాజీవ్ సాలూరు, గౌర హరిలు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్, సూర్యాపేట, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో ఈశ్వర్ మాట్లాడుతూ “నేను చేస్తున్న రెండవ చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’.

నేను రాసుకున్న సబ్జెక్ట్ ఇది. అప్పటికే ‘కథనం‘ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు నాదెళ్ల రాజేష్‌కి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఆయనకి కథ నచ్చడంతో ఈ సినిమా చేశాము. మొయినాబాద్‌లో ఒక ఐటమ్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేసి చాలా రిచ్‌గా సాంగ్‌ను చిత్రీకరించాం. ఈ సాంగ్‌తో షూటింగ్ మొత్తం పూర్తయింది. వారం రోజుల్లో ఐటమ్ సాంగ్ రిలీజ్‌తో పాటు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు నాదెండ్ల రాజేష్ మాట్లాడుతూ “మా హీరో ఈశ్వర్ కథకి పూర్తి న్యాయం చేశాడు. కన్న డ, మలయాళం చిత్రాలలో హీరోయిన్‌గా నటించి న నైనా సర్వర్‌కి ఇది తెలుగులో మొదటి సినిమా. ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ రోల్ ఈ సినిమాకు కీలకం”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News