Monday, March 3, 2025

కోదాడలో లారీ దగ్ధం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జాతీయరహదారిపై సిమెంటు లారీ దగ్ధమైన సంఘటన సూర్యాపేటలో జిల్లాలోని కోదాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దోరకుంట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ముందున్న వాహనం పల్టీలు కొట్టింది. సిమెంట్ లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఇద్దరు డ్రైవర్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీలు విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News