Monday, December 23, 2024

సూర్యాపేటలో లారీ కిందికి దూసుకపోయిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మునగాల: సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి వున్న లారీ కిందికి కారు దూసుకపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీ కింద నుంచి కారును బయటకు తీశారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News