Thursday, January 23, 2025

సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో..

- Advertisement -
- Advertisement -

హాసిని గాయత్రి క్రియేషన్స్‌పై అభయ్, అస్మిత నర్వాల్, గిరిష్మ నేత్రిక హీరో హీరోయిన్లుగా ఆర్.సుమధుర్ కృష్ణ దర్శకత్వంలో పాత్ లోథ్ శంకర్ గౌడ్ నిర్మిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ప్రసన్న ఆంజనేయస్వామి గుడిలో ఘనంగా జరిగాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ క్లాప్ కొట్టగా నిర్మాత పాత్ లోథ్ శంకర్ గౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. చిత్ర దర్శకు డు ఆర్.సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ “ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతోంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుంది. జనవరి 2 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని అన్నారు. హీరో అభయ్ మాట్లాడుతూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్నా రు. ఈ వేడుకలో హీరోయిన్లు అస్మిత నర్వాల్, గిరిష్మ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News