Thursday, January 23, 2025

రహస్య ట్వీట్‌పై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి స్పష్టీకరణ!

- Advertisement -
- Advertisement -

ముంబై: ‘నువ్వు వేశ్యవు, వేశ్యగా ఉండేదానివి, ఉంటావు!’ అన్న క్రిప్టిక్ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ట్వీట్ మిస్టరీగా చనిపోయిన ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్ రాసినది. రహస్యంగా ఉన్న ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. ఆమె పరోక్షంగా నటి రియా చక్రబర్తిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ప్రియాంక సింగ్ మాత్రం తాను ఏ వ్యక్తిని ఉద్దేశించి రాయలేదని పేర్కొంది.

రియా చక్రబర్తి మళ్లీ తెరపైకి రాబోతోంది. ప్రియాంక మంగళవారం(ఏప్రిల్ 11న) ‘నువ్వెందుకు భయపడతావు, నువ్వు వేశ్యగా ఉండేదానివి, ఉన్నావు, ఉంటావు’ అని ట్వీట్ చేసింది. ప్రపంచంలో ఉన్న పరిస్థితులపై కోపంతో తాను అలా రాశానే తప్ప ఏ వ్యక్తిని ఉద్దేశించి అలా రాయలేదని ఆమె తర్వాత స్పష్టీకరణ ఇచ్చుకుంది.

ఇదిలావుండగా ‘చెహ్రే’ నటి రియా చక్రబర్తి ఓ వీడియోలో ‘మీకేమనిపిస్తోంది, నేను మళ్లీ రాను, భయపడిపోతానని? భయపడి పారిపోవడం అన్నది ఇతరులు చేస్తారు’ అని తెలిపింది.

నటుడు సుశాంత్ రాజ్‌పుత్ అనుమానస్పదంగా చనిపోయాక, ఆయన తండ్రి కె.కె.సింగ్ నటుడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రబర్తిపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నటుడి ఖాతా నుంచి ర. 15 కోట్లు కాజేసి అతడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని నిందించారు. కాగా ఈడి జులై 31న నటిపై మనీలాండరింగ్ కేసు పెట్టింది. సిబిఐ కూడా ఆగస్టు 6న రియా చక్రబర్తిపై కేసు దాఖలు చేసింది. ఆమెను సెప్టెంబర్ 8న ఎన్‌సిబి అరెస్టు కూడా చేసింది. అక్టోబర్ 7న ఆమెకు బెయిల్ లభించింది. తాను డ్రగ్ సిండికేట్‌లో భాగస్వామిని కాదని ఆమె స్పష్టం చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న తన ముంబై ఇంట్లో చనిపోయి కనబడ్డాడు. ఆయన చావుపై ఇప్పటికీ తెలియని అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన అప్పుడప్పుడే బాలీవుడ్ లో ఎదుగుతున్న వర్ధమాన నటుడు. బంగారు భవిష్యత్తు ఉన్న ఆ నటుడు అకాల మరణం చెందాడు. ఏదో కుట్ర కోణం అతడి చావు వెనుక దాగి ఉందని చాలా మంది ఇప్పటికీ అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News