పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
చండీగఢ్: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను శనివారం పోలీసులు పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌పై ఇప్పటికే లుక్‌ఔట్‌ను జారీ చేశారు. మరోవైపు అభియోగాలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టులోలో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని ఢిల్లీలోని రోహిణి కోర్టు కొట్టేసింది. ఆరోపణలు వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సుశీల్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేగాక సుశీల్ కుమార్‌పై లక్ష రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ఇక సుశీల్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని సహచరుడు అజయ్ కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అజయ్‌ను పట్టించిన వారికి 50 వేల రూపాయల రివార్డును ఇస్తామని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా సుశీల్ కుమార్, అజయ్‌లు రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ టోల్ ప్లాజా కెమెరాలకు చిక్కారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని అధారంగా చేసుకున్న పోలీసులు వీరిని పట్టుకునేందుకు వేటను ముమ్మరం చేశారు. చివరికి ఇద్దరి పంజాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇక సుశీల్ కుమార్, అజయ్ కుమార్‌ల అరెస్ట్‌ను పోలీసులు ధ్రువీకరించారు. ఇదిలావుండగా ఢిల్లీలోని ఓ స్టేడియం వద్ద రెజ్లర్ సాగర్ రాణా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.