Monday, December 23, 2024

నితీశ్ ముక్కు నేలకు రాసినా ఎన్‌డిఎలోకి రానివ్వం: సుశీల్ మోడీ

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ముక్కు నేలకు రాసినా ఆయనను ఎన్డీఏలోకి రానివ్వమని, అందుకు బీజేపీ ఒప్పుకోదని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అన్నారు. నితీశ్‌కుమార్‌కు ఎన్డీఏ తలుపులు మూసుకుపోయాయని కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని సుశీల్ మోదీ గుర్తుచేశారు. అమిత్ షా ఒక్కసారి మాత్రమే కాదు, రెండు సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారని అన్నారు. నితీశ్‌కుమార్‌ను ఎన్డీఏలోకి రానిచ్చే ప్రసక్తే లేదని సుశీల్ తెగేసి చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లవచ్చనే అర్థం వచ్చేలా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుశీల్ మోడీ పైవిధంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News