Monday, January 20, 2025

ఇకపై సింగిల్‌గానే ఉంటా

- Advertisement -
- Advertisement -

మాజీ మిస్ యూనివర్స్, సీనియర్ నటి సుష్మిత సేన్ ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని చెప్పింది. ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మాట్లాడుతూ తాను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని, ఇకపై కూడా సింగిల్‌గానే ఉంటానని స్పష్టం చేసింది. తనకు ప్రేమ, పెళ్లిపై ఆసక్తిలేదని పేర్కొంది సుష్మిత. గతంలో ఐదేళ్ల పాటు ఒకరితో ప్రేమలో ఉన్నానని, ఇప్పుడైతే అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసింది.

ఇకపై కూడా తన స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తూ గడిపేస్తానని స్పష్టం చేసింది. ఈమధ్యనే తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటన చేసింది ఆమె. ఇంతలోనే ఆమె మనసు మారినట్లు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కాస్త కఠినంగా, గందరగోళంగా అనిపిస్తోంది. కానీ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని మొన్నామధ్య చెప్పిన సుష్మిత, ఇప్పుడు మాత్రం తాను పెళ్లికి శాశ్వతంగా దూరం అనే అర్థం వచ్చేలా మాట్లాడింది. ప్రస్తుతం ఈమె వయసు 49 ఏళ్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News