హైదరాబాద్: సుస్మితా సేన్ ప్రఖ్యాత నటి. అనేక భాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనైతే ‘ఒకే ఒక్కడు’ సినిమాలో కేవలం ఒక్క పాటతో ఉర్రూతలూగించింది. మగవాళ్లను మత్తెక్కించే హోయలు ఆమెవి.
చాలా కాలంగా ఆమె రోహమన్ షాల్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఉంది. కానీ ఇటీవల విడిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను గత రెండు సంవత్సరాలుగా ఒంటరిగానే ఉంటున్నానని పేర్కొంది. ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం వివరాలు పంచుకుంది. ‘‘2021 నుంచి నేను ఎవరితో రిలేషన్ షిప్ లో లేను. నా జీవితంలో నేను అద్బుతమైన వ్యక్తులను చూశాను. అనేక మంది నా కాల్ కోసం ఎదురు కూడా చూస్తుంటారు’’ అంది.
‘‘ రోహన్, నేను మంచి స్నేహితులం. మా మధ్య సంబంధం చాలా కాలం కొనసాగింది. అయితే మా మధ్య సంబంధం ప్రస్తుతం తెగిపోయింది. అయినా మా మధ్య ప్రేమ చెరగిపోలేదు. ఎక్కువగా ఊహించుకోకండి’’ అంటూ ఇంటర్వ్యూలో చెప్పింది.