Wednesday, January 22, 2025

తేజస్విని హంతకునిపై కేసు దాఖలు

- Advertisement -
- Advertisement -

లండన్ : భారతీయ విద్యార్థిని తేజస్విని కొంతం హత్య కేసులో నిందితుడైన 23 ఏళ్ల కెవిన్ ఆంటోనియో డీమోరిస్ పై కేసు దాఖలు చేయడమైందని ప్రస్తుతం పోలీస్ కస్టడీలో రిమాండ్‌లో ఉన్నాడని, యుక్స్‌బ్రిడ్జి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తామని పోలీస్‌లు వెల్లడించారు. ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులను విడిచిపెట్టినట్టు చెప్పారు.

డీమోరిస్ కత్తి దాడిలో గాయపడిన మరో మహిళ అఖిల కూడా భారత్‌కు చెందిన వారే. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంకా ఆమె షాక్‌లో ఉందని బ్రిటన్ లోని ఇండియన్ నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రకటించింది. తేజస్విని కుటుంబానికి వీరు సంతాపం తెలిపారు. అఖిల వేగంగా కోలుకోవాలని, ఆయా కుటుంబాలకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామని అసోసియేషన్ అభిలషించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News