Monday, December 23, 2024

లాస్ ఏంజిల్స్‌లో నిందితుడి ఆత్మహత్య!

- Advertisement -
- Advertisement -

లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నిలయా డ్యాన్స్ క్లబ్ కాల్పుల్లో 10 మందిని పొట్టనబెట్టుకున్న నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రెండోసారి కాల్పులకు ప్రయత్నించిన అతడి వ్యాన్ సమీపానికి పోలీసులు రావడంతో తనను తాను కాల్చుకున్నాడని తెలిపారు. నిందితుడిని 72 ఏళ్ల హూ కెన్ ట్రాన్ అని గుర్తించారు. ఇతర నిందితులు ఎవరూ పరారీలో లేరని కూడా లూనా తెలిపారు.

దక్షిణ కాలిఫోర్నియా బాల్‌రూమ్ డ్యాన్స్ స్టూడియోపై కాల్పులు జరిపి 10 మంది మృతికి, మరి 10 మంది గాయపడ్డానికి కారణమైన అనుమానితుడి వ్యాన్‌ను పోలీసులు ఆదివారం చుట్టుముట్టారు. అతడి వ్యాన్‌లోకి ప్రవేశించడానికి ముందు గంటల తరబడి వ్యూహాత్మక వాహనాలను, బాంబు స్కాడ్ ట్రక్కులను మోహరించారు. పోలీసులు అతడి వ్యాన్‌లోకి ప్రవేశించినప్పుడు అతడు స్టీరింగ్ మీద చచ్చిపోయి పడిఉండడం కనిపించింది. తర్వాత అతడిని వాహనం నుంచి బయటికి తెచ్చారు. కానీ వెంటనే అధికారులు అతడిని గుర్తించలేకపోయారు.

మాంటెరీ పార్క్‌లోని స్టార్ బాల్‌రూమ్ డ్యాన్స్ స్టూడియోలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని లూనా తెలిపారు. 20 నుంచి 30 నిమిషాల తర్వాత సమీపంలోని అల్హంబ్రాలోని లై లై బాల్‌రూమ్‌లోకి ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించాడు. అతడు పారిపోయే ముందు ప్రజలు అతడి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారని లూనా తెలిపారు. అల్హంబ్రాలో ఏ రకమైన తుపాకీని స్వాధీనం చేసుకున్నారో చెప్పడానికి షెరీఫ్ నిరాకరించారు. మాంటెరీ పార్క్‌లో ఉపయోగించిన తుపాకీ అసాల్ట్ రైఫిల్ కాదని పరిశోధకులు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ మారణకాండ నెలలో జరిగిన ఐదో సామూహిక హత్య. మే24న టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో 21 మంది మరణించిన తర్వాత ఇదే అత్యంత ఘోరమైన దాడి.

Los Angeles 2

Sheriff Helicopter

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News