Sunday, January 19, 2025

బెంగళూరు హంతకుడిని పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇటీవల కర్నాటక రాజధాని బెంగళూరులోని కోరమంగల లోని వెంకట్ రెడ్డి లేఅవుట్ లో కృతి కుమారి(24) అనే మహిళను మంగళవారం  ఓ అగంతకుడు పొడిచి చంపాడు. ఆమె భీహార్ కు చెందిన మహిళ. పేయింగ్ గెస్ట్ హౌస్ లో ఉంటోంది. నిందితుడిని అభిషేక్(26) గా పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి. దయానంద తెలిపారు. నిందితుడిని మధ్యప్రదేశ్ కు చెందిన భోపాల్ లో అరెస్టు చేశారు. అతడిని బెంగళూరుకు తెచ్చి విచారించనున్నట్లు ఆగ్నేయం డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరా ఫాతిమా తెలిపారు.

హతురాలైన కృతి కుమారి కోరమంగళకు చెందిన వెంకటరెడ్డి లేఅవుట్ లోని భార్గవి స్టేయింగ్ హౌస్ లో ఉంటుండేది. హంతకుడు మూడో అంతస్తులో ఉన్న పిజిలోకి వెళ్లి ఆమెను అనేకసార్లు పొడిచి చంపేశాడు. అయితే అతడు ఆమెను ఎందుకు చంపాడన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. హత్య జరిగాక అభిషేక్ తన ఫోన్ ని స్విచ్చాఫ్ చేసి భోపాల్ కు పారిపోయాడు. హత్య జరిగిన మూడు రోజులకు పోలీసులు అతడిని పట్టుకున్నారు.

Kriti

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News