Saturday, December 21, 2024

జర్మనీలో కారు బీభత్సం: ఇద్దరు మృతి…. 68 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

బెర్లీన్: జర్మనీలోని మగ్‌డెబర్గ్ ప్రాంతలో క్రిస్మస్ మార్కెట్‌లో కారు బీభత్సం సృష్టించింది. కిస్మస్ మార్కెట్‌లో పాదచారులపైకి అతి వేగంగా కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 68 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పాదచారులను ఢీకొట్టిన తరువాత కారు 400 మీటర్లు దూసుకెళ్లింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  బిఎండబ్ల్యు కారు డ్రైవ్ చేసిన వ్యక్తి డాక్టర్ సక్సోనీ అన్‌హల్ట్‌గా(50) గుర్తించారు. సౌదీ అరేబియా చెందిన సక్సోనీ 2006 నుంచి జర్మనీలో ఉంటున్నాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News