Sunday, December 22, 2024

ఎపిలో మంకీఫాక్స్ కలకలం..

- Advertisement -
- Advertisement -

ఎపిలో మంకీఫాక్స్ కలకలం
చిన్నారి రక్తనమూనాలను పుణే ల్యాబ్‌కు తరలింపు
ల్యాబ్ రిపోర్ట్‌లో నెగటివ్‌గా నిర్ధారణ
సాధారణ దద్దుర్లేనని తేల్చిన వైద్యులు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీఫాక్స్ భారత్‌కు విస్తరించి తొలికేసు కేరళలో నమోదు కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలో ఓ చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీఫాక్స్ కేసుగా అనుమానించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఆ చిన్నారి కుటుంబం సౌదీ అరేబియా టూర్‌కు వెళ్లి శనివారమే తిరిగి వచ్చినట్లు జిజిహెచ్ ఆస్పత్రి సూపరింటెండ్‌ంట్ మీడియాకు తెలిపారు. సదరు చిన్నారి రక్త నమూనాలను సేకరించిన అధికారులు పుణె ల్యాబ్‌కు పంపించామని, అనంతరం చిన్నారి కుటుంబాన్ని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
చిన్నారికి సాధారణ దద్దుర్లే ః
విజయవాడలో చిన్నారి శరీరంపై కనిపించిన దద్దుర్లు కనిపించగా విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించగా ఆ చిన్నారికి వచ్చింది సాధారణ దద్దుర్లేనని వైద్యులు తేల్చారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలో చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆ చిన్నారి నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించగా మంకీఫాక్స్ నెగటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఆ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి సోకలేదని వైద్యులు నిర్థారించారు. ఈక్రమంలో ఆ చిన్నారి కుటుంబం ఇతరులతో కాంటాక్టు కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ తెలిపారు.
స్మాల్‌ఫాక్స్ కుటుంబానికి చెందినదే ః వైద్యులు
మంకీఫాక్స్ ఒక వైరల్ వ్యాధి అని. ఈ వ్యాధి స్మాల్‌ఫాక్స్ కుటుంబానికి చెందినదేనని వైద్యులు వివరిస్తున్నారు. ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుందన్నారు. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయని తెలిపారు. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని, ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీఫాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌వొ పేర్కొందని వివరించారు. ఈ వ్యాధి సోకిన వారికి తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని, స్మాల్పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయని తెలిపారు.

ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయని, ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారన్నారు. కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోన్న మంకీఫాక్స్ ఇప్పటికే 59 దేశాలకు పాకిందని, 6వేల మందిలో నిర్ధారణ కాగా ముగ్గురు మృత్యువాతపడ్డారని తెలిపారు. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందన్నారు. ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Suspected Monkeypox case in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News