Thursday, November 21, 2024

అంతరాష్ట్ర గంజాయి రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర నిందితులను టిఎస్‌నాబ్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.9కోట్లు ఉంటుంది. టిస్‌నాబ్ డిసిపి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లా, పందర్‌పూర్ గ్రామానికి చెందిన జలాలుద్దిన్ సిద్దిఖీ అహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ, జమీల్ అక్తర్ కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు.

జలాలుద్దిన్ సిద్ధిఖీ కుటుంబం 12 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం బీహార్ నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు వెళ్లి స్థిరపడింది. ఓ కంపెనీలో పనికి కుదరడంతో నెలకు రూ.15,000 ఇస్తున్నారు. ఈ సమయంలో గంజాయి విక్రయించే మహారాష్ట్రకు చెందిన నయింతో పరిచయం ఏర్పడింది. ఎపిలోని విశాఖపట్టణం, అరకు నుంచి గంజాయి రవాణా చేస్తే కమీషన్ ఇస్తానని చెప్పాడు. అరకుకు వెళ్లి అక్కడ పాండు అనే వ్యక్తి వద్ద గంజాయి తీసుకుని రావాలని చెప్పాడు.

దీనికి అంగీకరించిన ఇద్దరు వ్యక్తులు అరకుకు వచ్చి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నయింకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు వచ్చారు. అరకులో కిలో గంజాయిని రూ.10,000లకు కొనుగోలు చేసి గంజాయి తీసుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. నయింకు కిలో గంజాయిని రూ.20,000లకు విక్రయిస్తున్నారు. నానో కారులో గంజాయి తీసుకుని వెళ్తుండగా విషయం పోలీసులకు తెలిసింది. టిఎస్‌నాబ్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News