Wednesday, January 22, 2025

అంతరాష్ట్ర గంజాయి రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఒడిసా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహేశ్వరం ఎస్‌ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 200 కిలోల గంజాయి, కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి డిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, పూణేజిల్లాకు చెందిన సందీప్ అనిల్ ఇద్రేకర్ వ్యాపారం చేస్తున్నాడు, విశాల్ కండుగడ్గి డ్రైవర్, ఒడిసాకు చెందిన లక్ష్మణ్ గంజాయి విక్రయిస్తున్నాడు. సందీప్, విశాల్ చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. తనతో వచ్చి గంజాయిని రవాణా చేస్తే ట్రిప్పుకు రూ.25,000 ఇస్తానని విశాల్‌కు చెప్పాడు.

ఈ క్రమంలోనే గంజాయి విక్రయిస్తున్న ఒడిసాకు చెందిన లక్ష్మణ్‌తో పరిచయం పెంచుకున్నాడు. గంజాయి రవాణా చేసేందుకు హుంద్యాయ్ క్రేటా కారును కొనుగోలు చేశాడు. కారు మహారాష్ట్రకు చెందిన పోలీసులదిగా అనుకోవాలని కారు ముందుభాగంలో ఎస్సై క్యాప్ పెట్టి తిరుగుతున్నారు. క్యాప్ పెట్టడం వల్ల చెక్‌పోస్టుల్లో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవచ్చని నిందితులు ప్లాన్ వేశారు. ఇద్దరు కలిసి మహారాష్ట్రలోని మల్కాన్‌గిరికి వెళ్లి అతడి వద్దకు తక్కువ ధరకు 200 కిలోల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలియగానే మహేశ్వరం ఎస్‌ఓటి పోలీసులు చౌటుప్పల్ వద్ద నిందితుల కోసం మాటువేశారు. పంతంగి చెక్‌పోస్టు వద్దకు కారులో నిందితులు రాగానే పట్టుకున్నారు. ఇద్దరు రెండు నెలల క్రితం 80 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తరలించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News