Wednesday, January 22, 2025

సస్పెన్స్, మిస్టరీ సినిమా ‘సందేహం’

- Advertisement -
- Advertisement -

‘సందేహం’ అనే సినిమాలో సుమన్ తేజాకు జంటగా హీరోయిన్ హెబ్బాపటేల్ నటించారు. ఈ సినిమాకు సతీశ్ పరమవేద దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు వర్షిణి క్రియేషన్ బ్యానర్ పై పర్చా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్ డ్యూయల్ రోల్ చేయగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు  శుభ శ్రీ, శ్వేతా వర్మ, రాశిక శెట్టిలతో పాటు శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.

కథ విషయానికి వస్తే…ఇది కరోనా సమయంలో జరిగిన స్టోరీ. హర్ష(సుమన్ తేజ్) ప్రేమించిన అమ్మాయి శృతి(హెబ్బా పటేల్)ని పథకం ప్రకారం పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు, ఆ తర్వాత కూడా శృతి కొంచెం టైం కావాలంటుంది. అదే సమయంలో హర్ష లాగే ఉండే ఆర్య(సుమన్ తేజ్) వ్యక్తి వీళ్ళ జీవితంలోకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా  ప్రవేశిస్తాడు.

ఆర్య అప్పుడప్పుడు వీళ్ళింటికి వస్తూ ఇబ్బంది పెడుతుంటాడు. ఇదంతా చూసి హర్ష తట్టుకోలేకపోతాడు. వీళ్ళేం చేస్తారో చూద్దాం అనుకుని ఒక రోజు బెంగుళూరు వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. తిరిగి వచ్చాక హర్షకు కరోనా వస్తుంది. కరోనా లక్షణాలు ఎక్కువవ్వడంతో హాస్పిటల్ లో చేరుతాడు.

‘కరోనాతోనే హర్ష చనిపోయాడు’ అని ఫ్యామిలీ డాక్టర్ శృతికి తెలుపుతాడు. హర్ష చనిపోయాడనుకుని వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధలో ఉంటుంది. కానీ ఒక రోజు హర్ష ఫోన్ నుంచి హర్ష చెల్లికి(రాశిక శెట్టి) మిస్డ్ కాల్ వస్తుంది. దీంతో హర్ష చెల్లికి ‘అసలు తన అన్నయ్య చనిపోయాడా, బతికే ఉన్నాడా?’ అని అనుమానం కలుగుతుంది.

హర్ష చనిపోయాడా? బతికే ఉన్నాడా? హర్ష చెల్లికి కాల్ చేసింది ఎవరు? పోలీసులు హెబ్బా పటేల్ ని ఎందుకు అదుపులోకి తీసుకుంటారు? ఆర్య ఏమయ్యాడు? వంటివి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

భార్యాభర్తల మధ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తే ఏంటి? అన్న అంశంపై గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో కరోనా అనే ఓ కొత్త పాయింట్ ని జోడించాడు దర్శకుడు. సినిమా సస్పెన్స్ తో కొనసాగుతుంది. ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయి.

సుమన్ తేజ్ హర్ష, ఆర్య రెండు పాత్రల్లో డ్యూయల్ రోల్ చేసి మెప్పిస్తాడు. హర్ష పాత్రలో నిదానంగా, ఆర్య పాత్రలో ఫుల్ యాక్టివ్ గా నటించాడు. హెబ్బా పటేల్ తన అందంతో పాటు నటనతో అలరిస్తుంది. ఎమోషన్ సీన్స్ లో కూడా మెప్పిస్తుంది. హీరో చెల్లి పాత్రలో రాశిక శెట్టి కూడా తన అందంతో పాటు నటనతో కూడా మెప్పించింది. బిగ్ బాస్ శ్వేతా వర్మ పోలీసాఫీసర్ గా పర్వాలేదనిపిస్తుంది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు.

ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో మెప్పించారు. కథలో కొత్తదనంతో కనిపిసత్ుంది. దర్శకుడిగా సతీశ్ పరమవేద ఈ సినిమాకు న్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News