Monday, December 23, 2024

స్పీకర్‌ను కలవండి

- Advertisement -
- Advertisement -

Suspended BJP MLAs to meet Speaker immediately:TS high court

సస్పెన్షన్‌కు గురైన బిజెపి ఎంఎల్‌ఎలకు హైకోర్టు సూచన

మనతెలంగాణ/హైదరాబాద్ : సస్పెండైన బిజె పి ఎంఎల్‌ఎలు వెంటనే స్పీకర్‌ను కలవాలని హై కోర్టు సోమవారం నాడు సూచించింది. సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు తెల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోపే స్పీకర్ ముందు ఎంఎల్‌ఎలు అభ్యర్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. మనది పార్లమెంటరీ డె మోక్రసీ అని, ప్రశ్నించే ప్రజాప్రతినిధులు ఉంటే నే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలపడుతుందని పేర్కొంది. ఎంఎల్‌ఎలు సభ హక్కులు ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవ ని హైకోర్టు అభిప్రాయపడింది.

అదేవిధంగా ప లు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు కలగజేసుకోవచ్చని హైకోర్టు పే ర్కొనడంతో పాటు ప్రజాస్వాయ్యం పరిఢవిల్లాలంటే ప్రశ్నించే ఉండాలని తెలుపుతూ విచారణను ముగించింది. ఇదిలావుండగా ఎంఎల్‌ఎల సస్పెన్షన్‌పై సింగిల్ జడ్జి స్టే ఇచ్చేందుక నిరాకరించగా బిజెపికి చెందిన ముగ్గురు ఎంఎల్‌ఎలు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనానికి అప్పీల్ దాఖలు చేశారు. తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరడంతో ద్వి సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా అసెంబ్లీ కార్యదర్శికి తాము నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన సహకరించలేదని, ఉద్దేశ్యపూర్వకంగా ఆయన నోటీసులు తీసుకోవడం లేదని ఎంఎల్‌ఎల తరపు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. అలాగే అసెంబ్లీ నియమావళికి విరుద్దంగా ఎంఎల్‌ఎలను సస్పెండ్ చేశారని కోర్టుకు విన్నవించారు.

స్పీకర్ ఎలాంటి ప్రస్తావన చేయకుండానే నేరుగా మంత్రి తీర్మానం ప్రవేశపెట్టడం దాన్ని ఆమోదించారని ఇవన్నీ ముందస్తు ప్రణాళికతో చేశారని ఆయన వాదించారు. దీంతో హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని అసెంబ్లీ కార్యదర్శికి కచ్చితంగా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు సిబ్బంది లోపలికి వెళ్లి కార్యదర్శికి నోటీసులు ఇచ్చే విధంగా నగర పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సాయంత్రానికి వాయిదా వేసింది. జ్యుడిషియల్ రిజిస్ట్రార్ సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీకి వెళ్లి నోటీసులు అందజేసినట్లు సాయంత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యపై సభాపతి పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని, సస్పెండైన ఎంఎల్‌ఎల వెంటనే స్పీకర్ ఎదుట హాజరుపర్చాలని అసెంబ్లీ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది.

జోక్యం చేసుకోవద్దు ః

ఎంఎల్‌ఎల సస్పెన్షన్‌పై సభాపతికి అధికారాలు ఉంటాయని, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టులకు పరిమితంగా అధికారాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. సమస్య పరిష్కారానికి పార్టీలకు అతీతంగా సభాపతి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇది జరిగింది ః

ఈనెల 7న రాష్ట్ర బడ్డెట్ ప్రవేశపెట్టిన రోజు బిజెపి ఎంఎల్‌ఎలు వెల్‌లోకి వెళ్లి సభా కార్యకలాపాలకు అంతరాయం కల్గించారంటూ ముగ్గురిపై అధికారపక్షం సస్పెన్షన్ వేటు వేసింది. అసెంబ్లీ సెషన్స్ ముగిసే వరకు బిజెపి ఎంఎల్‌ఎలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ సభకు రాకుండా సస్పెన్షన్ విధించింది. దీంతో అధికారపక్షం తీరును సవాల్ చేస్తూ బిజెపి ఎంఎల్‌ఎలు హైకోర్టును ఆశ్రయించారు. సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. వారి పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనేక ప్రయత్నాలు చేసినా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయలేకపోయామని హైకోర్టు రిజిస్ట్రీకి తెలిపారు. సస్పెన్షన్ తీరు రాజ్యాంగానికి, శాసనసభ నియమావళి విరుద్ధంగా ఉందని వాదించారు. కనీసం సస్పెన్షన్ ఉత్తర్వులు, వీడియో రికార్డింగులు కూడా ఇవ్వడం లేదన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News