Monday, January 20, 2025

ప్రధాన సూత్రధారి ప్రభాకర్‌ర్రావే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు వెల్లడించిన వివరాల ఆధారంగా శనివారం అరెస్టయిన భూపాలపల్లి అడిషనల్ ఎస్‌పి భుజంగరావు, హైదరాబాద్ సె క్యూరిటీ విభాగం అడిషనల్ డిసిపి తిరుపతన్న లను ఆదివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వీరిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 6 వరకు వీరికి రిమాండ్ విధించగా, అనంతరం పోలీసులను వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొంపల్లి మెజిస్ట్రేట్ నివాసం వద్ద నిందితుల తరఫు అడ్వకేట్ రాజేందర్ మాట్లాడుతూ భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు రెండు వారాల పాటు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. రిమాండ్ వ్యతిరేకించడంతో పాటు బెయిల్ ఇవ్వాలని మేజిస్ట్రేట్‌ను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తమ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. దాంతో తాము తిరిగి మంగళవారం బెయిల్ ప్రొసీడింగ్స్ మొదలుపెడతామని అడ్వకేట్ రాజేందర్ తెలిపారు.

రిమాండ్‌లో భాగంగా నిందితులు ముగ్గుర్ని కొంపల్లి మేజిస్ట్రేట్ నివాసం నుంచి పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలిం చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, తిరుపతన్నలపై ఐపిసి సెక్షన్ 120ఎ, 409, 427, 201, 34 ఆఫ్ సెక్షన్ 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భుజంగరావు పొలిటికల్ ఇంటె లిజెన్స్ విభాగంలో, ఎస్‌ఐబిలో తిరుపతన్న అడిషనల్ ఎస్‌పిలుగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభా కర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు, ఐ న్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేపట్టి వారం రోజుల కిందట మొదట ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు.

ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఈ తతంగం మొత్తం అప్పటి ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజూరాబాద్ లాంటి కొన్ని ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల్ని లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు వెల్లడించారు. శుక్రవారం (మార్చి 22న) రాత్రి భుజంగరావు, తిరుపతన్న నివాసాలతో పాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల నివాసంలో సోదాలు నిర్వహించారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు ఇంట్లో కొన్ని కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News