Saturday, December 21, 2024

మాజీ డిఎస్పి ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుయిన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మాజీ డిఎస్పి ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ చేయసినట్లు తెలియడంతో జూబ్లీహిల్స్ ఎసిపి ఆధ్వర్యంలో విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. మాజీ డిఎస్పి ప్రణీత్ రావును పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగ రూమ్ ఏర్పాటు చేసుకుని,

అందులో 17 కంప్యూటర్లు పెట్టుకుని ట్యాపింగ్ చేశాడు. రహస్యంగా ప్రముఖుల ఫోన్ రికార్డింగ్స్‌ను మానిటర్ చేసి వాటిని సేవ్ చేశాడు. ఎన్నికల ఫలితాలు వెలుడిన డిసెంబర్ 4,2023న ఎస్‌ఐబి కార్యాలయానికి వచ్చిన ప్రణీత్ రావు కంప్యూటర్లలోని ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లో కాపీ చేసుకుని వెళ్లాడు. తర్వాత కంప్యూటర్లలోని సమాచారాన్ని అంతా డిలిట్ చేశాడు. తాను పట్టుబడకుండా ఉండేందుకు పాత హార్డ్ డిస్క్‌లను తీసివేసి కొత్త హార్డ్ డిస్క్‌లను అమర్చాడు.

భయటపడనున్న పేర్లు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును ప్రత్యేక బృందం కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పలువురి పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. తనను ట్యాపింగ్ చేయమని చెప్పిన వారి పేర్లు ప్రణీత్ రావు చెప్పే అవకాశం ఉంది. మాజీ డిఎస్పితో కలిసి పనిచేసిన వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రణీత్ రావు నోరు విప్పితే మరిన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News