Tuesday, April 1, 2025

ఒడిశా సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ.. తెరపైకి సురేశ్ పూజారి!

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బిజీ షెడ్యూల్ కారణంగా 10న జరగాల్సిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 12 కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సీనియర్ బీజేపీ నేత , కొత్తగా ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికైన సురేశ్ పుజారీ పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఆశావహుల జాబితాలో పుజారి పేరు కూడా ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో బార్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రజారాజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఇంతవరకు ఎవరి పేరూ ప్రకటించలేదు. రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల గెలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News