Friday, December 20, 2024

11మంది ఢిల్లీ పోలీసులపై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో అంజలిసింగ్ కారుప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటనలో పోలీసులు నిర్లక్షంపై చర్యలు వేగవంతం అయ్యాయి. పోలీస్ సిబ్బంది నిర్లక్షంపై కఠిన తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోరాకు కేంద్ర హోంశాఖ నుంచిఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాదం జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న 11మంది పోలీసులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరికంటే ముందు మూడు పిసిఆర్ వ్యానుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితోపాటు రెండు పోలీస్ పికెట్లలో ఉన్న మొత్తం పోలీసులును అధికారులు సస్పెండ్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో తక్షణం సమాచారం అందించడంలో వీరు విఫలమవడంతో చర్యలు తీసుకున్నారని సీనియర్ అధికారి తెలిపారు.

వీరిపై సస్పెన్షన్ వేటు తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఎంహెచ్‌ఎ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు అందాయి. స్పెషల్ కమిషనర్ షాలినీసింగ్ సారథ్యంలోని దర్యాప్తు కమిటీ నివేదిక అందిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు మేరకు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అంజలి చాలా కిలోమీటర్ల మేరకు కారు ఈడ్చుకుపోయినా పోలీసులు స్పందించకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. అంజలి దుర్మరణం కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరిని నేరానికి సహకరించారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News