Monday, January 20, 2025

148 ఎంపిలను సస్పెండ్ చేయడం దారుణం మాజీ ఎంపి హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్‌లో 148 ఎంపిలను సస్పెండ్ చేయడం దారుణమని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని, అందరిని బయటకు పంపి బిల్లులు పాస్ చేసుకోవడం అన్యాయమని మాజీ ఎంపి విహెచ్. హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంట్‌లో మోడీ కొత్త విధానాలు అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికి ఇలా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులు పార్లమెంట్ లోకి వచ్చి దాడి చేసిన అంశంపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News