Monday, January 20, 2025

లంచం అడిగిన డాక్టర్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని సోమవారం మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన తమని ఆస్పత్రి వైద్యుడు మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి అప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు…. తక్షణం వైద్యుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులను హెచ్చరించారు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించిన మంత్రి సేవలు అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగంలో నిత్యం స్కానింగ్‌లు నిర్వహించాలని చెప్పారు. అవసరమైన ఆల్ట్రా సౌండ్ యంత్రాలను అందిస్తామని హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News